కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
16, ఆగస్టు 2015, ఆదివారం
4, జులై 2015, శనివారం
సామూహిక అక్షరాభ్యాసంపై పత్రికలలో వచ్చిన వార్తలు
సామూహిక అక్షరాభ్యాసం 2015
![]() |
| తెలుగు తల్లికి పూలమాల వేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి గారు |
![]() |
| సరస్వతీ దేవి పూజ |
![]() |
| సాముహిక అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎం ఎల్ సి రామకృష్ణ గారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి గారు |
![]() |
| సాముహిక అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎం ఎల్ సి రామకృష్ణ గారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి గారు |
సాముహిక అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎం ఎల్ సి రామకృష్ణ గారు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసుల రెడ్డి గారు
23, మార్చి 2015, సోమవారం
సర్దార్ భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమం
దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ త్యాగాలను నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని శ్రీ సరస్వతి కమిటి అధ్యక్షురాలు లగడపాటి రామలక్ష్మి అన్నారు. సీతారామ నగరంలోని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాలలో జరిగిన భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమంలో లగడపాటి రామలక్ష్మి భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు పోరాటం చేసారని వారిలో భగత్ సింగ్ వంటి నేతలు చేసిన సాహసం చరిత్రలో నిలిచి పోయాయని రామలక్ష్మి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు భగత్ సింగ్ ఏ మాత్రం వేరవలేదని అన్నారు. ఉరి శిక్ష కోసం ఎదురు చూసి భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసే అవకాశం నాకు వచ్చినందుకు గర్వ పడుతున్నానని చాటిన భగత్ సింగ్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని రామలక్ష్మి పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల ప్రధానోపాద్యయులు బి రవీంద్రబాబు మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్దులు పాల్గొన్నారు.
18, మార్చి 2015, బుధవారం
పాటశాలపై జెమిని న్యూస్ లో స్టోరి
పాటశాలపై జెమిని న్యూస్ లో స్టోరి
పాటశాల బయోమెట్రిక్ పై పత్రికలలో వచ్చిన వార్తా కధనాలు
జెమిని న్యూస్ చానెల్లో శ్రీ సరస్వతి కమిటి పాటశాల బయోమెట్రిక్ కధనం
పాటశాలలో బయోమెట్రిక్ ను పరిసిలించేందుకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రినువాసుల రెడ్డి గారి సమక్షంలో బయోమెట్రిక్ పరికరంలో వేలిముద్రలు వేసిన ఉపాధ్యాయులు విద్యార్దులు. ఆ సందర్బంగా జరిగిన సభ జెమిని న్యూస్ చానెల్లో వచ్చిన వార్తా కదనం.
16, మార్చి 2015, సోమవారం
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రీనివాసుల రెడ్డి గారు పాటశాల బయోమెట్రిక్ పరిశీలన
21, ఫిబ్రవరి 2015, శనివారం
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం పాటశాలలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు భాషా ఆచార్యులు కృష్ణారావు గారు ముఖ్య అతిదిగా పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా కృష్ణారావు గారు మాట్లాడుతూ మాతృ భాషలో విద్యను అభ్యసించిన విద్యార్దులు పరాయి భాషలో చదువుకున్న విద్యార్దుల కంటే ఎంతో తెలివిగా ఉంటారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయని చెప్పారు. అందుకే యూరప్ దేశాలన్నీ తమ తమ మాతృ భాషల్లోనే తమ పిల్లలకు విద్యా బోధన చేయిస్తున్నాయని తెలిపారు. దాని వల్ల వారి మాతృ భాషా వికాసం చెందడంతోపాటు విద్యార్దులు కూడా మంచి జ్ఞానాన్ని సముపార్జించి ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతున్నారని అన్నారు. మనకున్న ఆంగ్ల భాషా వ్యామోహం కొంత తగ్గించుకోవలిసిన అవసరం ఎంతో ఉందని కృష్ణారావు గారు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పాటశాల అధ్యక్షురాలు శ్రీమతి లగడపాటి రామలక్ష్మి గారు, ప్రధానోపాద్యాయులు రవీంద్రబాబు గారు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
| తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు భాషా ఆచార్యులు కృష్ణారావు గారు |
![]() |

11, ఫిబ్రవరి 2015, బుధవారం
రాష్ట్రంలోనే తొలిగా పాటశాలలో బయో మాట్రిక్
శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల రాష్ట్రంలో ఎయిడెడ్, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రాబాబు నాయుడు గారి స్పూర్తిని అందిపుచ్చుకుని మన పాటశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం చేయడం జరిగింది. మన పాటశాలలోని ఉపాధ్యాయని ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో విద్యా భోదన చేస్తున్నారు. విద్యార్థులు కూడా చక్కగా ఉపాధ్యాయుల మనస్సులు మెప్పిస్తూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. ఈ నేపద్యంలో ప్రభుత్వం పాటశాలల్లో విద్యార్ధుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునేందుకు బయో మాట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. అదే సమయంలో ఉపాధ్యాయులు పాటశాలకు వచ్చి వెళ్ళే సమయం కూడా తెలుసుకోవాలని భావిస్తుంది. మన విద్య వ్యవస్థలో ప్రబుత్వం తీసుకు రావాలని అనుకుంటున్న ఈ ఆలోచన మన పాటశాల పాలకవర్గానికి స్పూర్తిని కలిగించింది. అందుకే ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను మనం అమలు చేద్దామని ముందుకు రావడం... అందుకు మన ఉపాధ్యాయని ఉపాధ్యాయులు సహకరిచడం సంతోషకరం. మన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి గారితో బయో మాట్రిక్ విధానం పాటశాలలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలియ చేసిన వెంటనే అయన అభినందనలు తెలియచేశారు. ఇక మీదట మన శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాలలో ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, విద్యార్ధుల రాక పోకలన్ని బయో మాట్రిక్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మన పాటశాల రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థలకు కచ్చితంగా ఆదర్శం కాగలదని భావిస్తున్నాను. మన పాటశాల పాలకవర్గం, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారంతోనే మనం ఈ ఘనతను సాధించగాలిగాము. అందుకు అందరికి ధన్యవాదాలు.

దాసరి వెంకట సుబ్బారావు
కరస్పాండెంట్
శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల
![]() |
| శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల |
![]() |
| బయో మాట్రిక్ మెషిన్ |
![]() |
| బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల విద్యార్దినిలు |
![]() |
| బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల విద్యార్దినిలు |
![]() |
| బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల ఉపాధ్యాయనీలు |
26, జనవరి 2015, సోమవారం
10, జనవరి 2015, శనివారం
సంక్రాంతి సంబరాలు
పాటశాలలో సంక్రాంతి సంబరాలు శుక్రవారం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం తొలిసారిగా పాటశాలలో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయులు మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టారు. ఈ సంక్రాంతి ఉత్సవాల్లో విద్యార్ధులతో చక్కని కార్యక్రమాలు చేయించారు. ముఖ్యంగా తెలుగు వారి సంప్రదాయమైన ముగ్గుల పోటీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారు. ఆ తరువాత సంక్రాంతి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్ధంగా చిన్నారి పిల్లలకు చేసే భోగి పళ్ళు పోసే కార్యక్రమం జరిగింది.
![]() |
| సాక్షి పత్రికలో మన పాటశాల వార్తా కథనం |
![]() |
| ఈనాడు పత్రికలో మన పాటశాల వార్తా కథనం |
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)




































