మొత్తం పేజీ వీక్షణలు

5, జులై 2017, బుధవారం

సామూహిక అక్ష‌రాభ్యాసం 2017

శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ ఎయిడెడ్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల్లోవేడుక‌గా సామూహిక అక్ష‌రాభ్యాసం

శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ ఎయిడెడ్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల్లో చ‌క్క‌టి విద్యాబోధ‌న అందిస్తార‌నే న‌మ్మ‌కంతో త‌ల్లిదండ్రులు ఈ ఏడాది 70 మంది పిల్ల‌ల‌ను చేర్పించార‌ని పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ డివిసుబ్బారావు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పాఠ‌శాల‌లో జ‌రిగిన సామూహిక అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్దుల‌తో అక్ష‌రాలు దిద్దించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కర‌స్పాండెంట్ డివిసుబ్బారావు మాట్లాడుతూ ప్ర‌భుత్వ , మున్సిప‌ల్ పాఠ‌శాల‌ల్లో విద్యార్దులు చేర‌డ‌మే క‌ర‌వు అవుతున్న తరుణంలో ఎయిడెడ్ పాఠ‌శాల్లో 70 మంది విద్యార్దులు చేర‌డం ఓ రికార్డుగా పేర్కొన్నారు. ఒక‌టో త‌ర‌గ‌తిలోనే 35 మంది విద్యార్దులు చేర‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ స్కూలు ఉపాధ్యాయుల అంకిత‌భావం... విధ్యాబోధ‌న‌కు త‌ల్లిదండ్రులు చూపించిన అభిమానానికి విద్యార్దుల చేర‌డ‌మే ఓ ఉదాహార‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ  ఎయిడెడ్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల్లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి హింది బోధ‌న కూడా ప్రారంభిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా క‌ర‌స్పాండెంట్ డివిసుబ్బారావు ప్ర‌క‌టించారు.  మాజీ ప్ర‌భుత్వ న్యాయ‌వాది చిగురుపాటి బొల్లారావు మాట్లాడుతూ ప్ర‌భుత్వ విద్యా సంస్థ‌ల్లో మంచి ఉన్న‌త విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉంటార‌ని అన్నారు. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పంపించ‌డం ద్వారా పిల్ల‌ల‌కు చ‌క్క‌ని క్ర‌మ‌శిక్ష‌ణ వ‌స్తుంద‌ని తెలిపారు. శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ స్కూలు న‌గ‌రంలో అత్యుత్త‌మ పాఠ‌శాల‌గా రాణించ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు.  చెంచు ఎయిడెడ్ యూపీ స్కూలు కర‌స్పాండెంట్ దాసు మాట్లాడుతూ ఒక‌నాడు స‌మాజానికి విద్య‌ను అందించిన ఘ‌త‌న ఎయిడెడ్ విద్యా సంస్థ‌ల‌కే ద‌క్కుతుంద‌ని అన్నారు. ఎయిడెడ్ పాఠ‌శాల‌ల వ‌ల్ల‌నే స‌మాజంలో అట్ట‌డుగు వ‌ర్గాల పిల్ల‌ల‌కు చ‌క్క‌ని విద్యాబుద్దులు అందుతున్నాయ‌ని తెలిపారు. విశ్వ‌శాంతి విద్యా సంస్థ‌ల అధినేత కృష్ణారావు మాట్లాడుతూ శ్రీ స‌ర‌స్వ‌తి పాఠ‌శాల కార్పోరేట్ పాఠ‌శాల‌ల‌కు ధీటుగా విద్య‌ను అందించ‌డమే కాకుండా... క్ర‌మ శిక్ష‌ణ‌లో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉంద‌ని అన్నారు. చుట్టుప‌క్క‌ల ఎన్ని కార్పోరేట్ పాట‌శాల‌లు  ఉన్న‌ప్ప‌టికి త‌ల్లిదండ్రులు వాటిని దాటుకుని శ్రీ స‌ర‌స్వ‌తి స్కూల్లో పిల్ల‌ల‌ను చేర్పించ‌డం నిజంగా అభినంద‌నీయం అన్నారు. సామూహిక అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మంలో విద్యార్దులు న‌ర్స‌య్య మేస్త్రి ప‌ల‌క‌లు, బ్యాగులు పంపిణి చేశారు. అంత‌కు ముందు తెలుగు త‌ల్లి విగ్ర‌హానికి ప్ర‌త్యేక పూజ‌లు చేసి అక్ష‌రాభ్యాస కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పాఠ‌శాల మాజీ ప్రధానోపాధ్యాయ‌ని వ‌ర‌ల‌క్ష్మి, ప్ర‌ధానోపాధ్యాయులు ర‌వీంద్ర‌బాబు,  యూటీఎఫ్ నాయ‌కులు జ‌గ‌దీష్ పాఠ‌శాల క‌మిటీ స‌భ్యులు సంక‌టి సాంబ‌శివ‌రావు, ఉమ్మ‌డి శెట్టి వెంక‌టేశ్వ‌ర్లు, ప‌సుపులేటి వెంకాయ‌మ్మ‌ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.