మొత్తం పేజీ వీక్షణలు

29, జూన్ 2014, ఆదివారం

స్ఫూర్తి ప్రదాయనిగా శ్రీ సరస్వతి ఎయిడెడ్ పాటశాల

అక్షరాభ్యాసం మన పాటశాలలో ఘనంగా జరిగింది. అదే సమయంలో చాలా ప్రభుత్వ పాటశాలల్లో అక్షరాభ్యాసం కార్యక్రమం జరగలేదు. ఇదే విషయాన్ని సాక్షి పత్రిక జిల్లా ఎడిషన్లో మొదటి పేజిలో ప్రధాన వార్తా కథనంగా ప్రచురించింది. వార్త కధనంలో మన శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాటశాలలో జరిగిన అక్షరాభ్యాసంలో పాల్గొన్న ముఖ్య అతిధి శ్రీ రాఘవేంద్ర ప్రభు మాస్టర్ గారు చిన్నారితో ఉన్న ఫోటో మరియు అక్షరాభ్యాసం కార్యక్రమానికి పలకలు బ్యాగ్లు అందించిన నరసయ్య మేస్త్రి గారు, నాగేశ్వరరావు గారి ఫోటోలను ప్రచురించారు