మొత్తం పేజీ వీక్షణలు

22, డిసెంబర్ 2016, గురువారం

ప‌త్రిక‌లలో మ‌న పాఠ‌శాల సెమి క్రిస్మ‌మ‌స్ వేడుక‌ల వార్త‌లు



స‌ర‌స్వ‌తి క‌మిటీ పాఠ‌శాలో ఘ‌నంగా సెమి క్రిస్మ‌స్ వేడుక‌లు

              

స‌హ‌నంతో మెల‌గ‌డం పాటు అంద‌రు శాంతియుతంగా జీవించాల‌ని కోరుకోవ‌డం ద్వారా ఏసు క్రీస్తు మాన‌వాళికి గొప్ప సందేశం అందించార‌ని  గుంటూరు ఉప విద్యాశాఖాధికారి ర‌మేష్ బాబు తెలిపారు. భావి భార‌త‌పౌరులైన విద్యార్దులు క్రీస్తు సందేశాన్ని అర్ధం చేసుకుని ఆచ‌రిస్తే మంచి పౌరులుగా మారతార‌ని అన్నారు. న‌గ‌రంలోని సీతారామ‌న‌గ‌ర్లో ఉన్న  శ్రీ స‌ర‌స‌ర్వ‌తి క‌మిటీ ఎయిడెడ్ ప్రాథమికోన్న‌త పాఠ‌శాల్లో సెమి క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకల్లో ఉప విద్యాశాఖాధికారి ర‌మేష్‌బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ వేడుక‌ల‌కు పాఠ‌శాల కర‌స్పాండెంట్ దాస‌రి వెంక‌ట సుబ్బారావు అధ్య‌క్షత వ‌హించారు. ఉప విద్యాశాఖాధికారి ర‌మేష్ బాబు త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ స‌ర‌స్వ‌తి క‌మిటీ స్కూలు విద్యార్దులు కార్పోరేట్ పాఠ‌శాల‌ల‌కు ధీటుగా చ‌దువుల్లో ముందంజ‌లో ఉన్నార‌ని ప్ర‌శంసించారు. ఎయిడెడ్ పాఠ‌శాల‌ల్లో విద్యార్దులు ఇంత చ‌క్క‌గా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండ‌టం ఎంతో అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ప్ర‌భుత్వం చ‌క్క‌ని ఉపాధ్యాయుల‌ను నియ‌మించి ఉచితంగా విద్య‌ను అందిస్తుంద‌ని ఆ అవకాశాన్ని అంద‌రు ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు. విద్యార్దులు, త‌ల్లిదండ్రుల కోరిక మేర‌కు స‌ర‌స్వ‌తి క‌మిటీ స్కూలుకు ఎనిమిదో త‌ర‌గ‌తిని కూడా మంజూరు చేస్తున్న‌ట్లు ఉప విద్యాశాఖాధికారి ర‌మేష్‌బాబు ప్ర‌క‌టించారు. పాఠ‌శాల క‌ర‌స్పాండెంట్ దాస‌రి వెంక‌ట సుబ్బారావు మాట్లాడుతూ స‌ర‌స్వ‌తి క‌మిటీ పాఠ‌శాల ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో విద్యాబోధ‌న చేస్తున్నార‌ని అన్నారు. అందుకే విద్యార్దులు... వారి త‌ల్లిదండ్రుల అభిమానం సంపాదించుకోగ‌ల‌గార‌ని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్దులే ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల విద్యార్దులు ఏడో త‌ర‌గ‌తి ముగిసిన త‌ర్వాత బాలిక‌లంతా డ్రాప్ అవుట్లుగా మారుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం ఎనిమిదో త‌ర‌గ‌తి విద్యాబోధ‌న చేసేందుకు అనుమ‌తి ఇస్తే బాలికా విద్య‌కు మేలు చేసిన వారౌతార‌ని అధికారుల‌ను కోరారు. ఎనిమితో త‌ర‌గ‌తి విద్యార్దుల‌కు బోధ‌న చేసేందుకు త‌మ ఉపాధ్యాయులు కూడా సిద్దంగానే ఉన్నార‌ని వివ‌రించారు. క్రైస్త‌వ మ‌త గురువు ఫాద‌ర్ జేసుదానం మాట్లాడుతూ సెమి క్రిస్‌మస్ వేడుక‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేయ‌డం చాలా అరుద‌ని, అటువంటిది స‌ర‌స్వ‌తి పాఠ‌శాల నిర్వ‌హించ‌డం ప‌ట్ల ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క్రీస్తు బోధ‌న‌ల‌ను ఆయ‌న విద్యార్దుల‌కు వివ‌రించారు. అనంత‌రం క్రిస్‌మ‌స్ కేకును ఉప విద్యాశాకాధికారి ర‌మేష్‌బాబు క‌ట్ చేశారు. ఈ  సంద్భర్భంగా స‌ర‌స్వ‌తి క‌మిటీ పాఠ‌శాల విద్యార్దిని విద్యార్దులు క్రీస్తు సందేశాన్ని వివ‌రించే పాట‌ల‌కుచ‌క్క‌ని నృత్యాలు చేశారు. జింగిల్ బెల్స్ వంటి పాట‌ల‌తో అంద‌ర్ని ఆక‌ట్టుకున్నారు. క్రిస్మ‌స్ వేడుక‌ల్లో శ్రీ‌నాథ్ ఉన్న‌త పాఠ‌శాల అధ్య‌క్షురాలు పిన్న‌మ‌నేని వ‌ర‌ల‌క్ష్మీ, క్రైస్త‌వ మ‌త గురువు శ్యామ‌స‌న్ రాబ‌ర్ట్స్,   పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు ర‌వీంద్ర‌బాబు, క‌మిటీ స‌భ్యులు ప‌సుపులేటి వెంకాయ‌మ్మ‌, సంక‌టి సాంబశివ‌రావు, ఉపాధ్యాయులు పి విజ‌య‌ల‌క్ష్మీ, గోవింద‌రెడ్డి,ప్ర‌మీల‌, ర‌వి, దీనా, వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌, నాగ‌మ్మ త‌దిత‌రులు పాల్గొన్నారు. 















11, సెప్టెంబర్ 2016, ఆదివారం

గురు పూజోత్స‌వం


07.09.2016న‌ పాఠ‌శాల‌లో జ‌రిగిన ఉపాధ్యాయ దినోత్స‌వ చిత్ర‌మాలిక‌. ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా తెలుగు త‌ల్లి విగ్ర‌హానికి పూల‌మాల వేస్తున్న ప్ర‌ధానోపాధ్యాయులు ర‌వీంద్ర‌బాబు.... చిత్రంలో ఉపాధ్యాయ బృందం





ప్ర‌ధానోపాధ్యాయులు ర‌వీంద్ర‌బాబు గారిని స‌త్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


లెక్క‌లు ఉపాధ్యాయులు గోవిందరెడ్డిగారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


 ఫిజిక్స్ ఉపాధ్యాయులు శంకరరావు గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


ఒకటో తరగతి ఉపాధ్యాయని నాగమ్మ గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


ఇంగ్లీష్  ఉపాధ్యాయులు రవి గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


సైన్స్  ఉపాధ్యాయని దీనా  గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు



హింది  ఉపాధ్యాయని విజయలక్ష్మి గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు


తెలుగు  ఉపాధ్యాయని ప్రమీల  గారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు



2తరగతి  ఉపాధ్యాయని వెంకటేశ్వరమ్మగారిని సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు విద్యార్దులు

పాఠశాల ఆయా మేరీని  సత్క‌రిస్తున్న ఉపాధ్యాయులు 




18, జూన్ 2016, శనివారం

శ్రీ స‌ర‌స్వ‌తి వ‌డిలో తెలుగు వ‌నానికి తోర‌ణాలు

మొక్క‌లు మాన‌వ జీవ‌న ఆధారాలు... అందుకే ఆ మొక్క‌కు ఎలా మొక్కాలో... మొక్క‌ను ఎలా కాపాడుకోవాలో రేప‌టిపౌరులైన నేటి బాల‌ల‌కు వివ‌రించేందుకు శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల వ‌న భార‌తి కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఉన్న తెలుగుత‌ల్లి విగ్ర‌హం చుట్టుప‌క్క‌ల తెలుగు వ‌నాన్ని పెంచేందుకు శ్రీ‌కారం చుట్టింది. సుమ బాల‌ల‌ను విర‌బూయించేందుకు బాల‌లు త‌మ బంగారు చిట్టి చేతుల‌తో చిట్టిమొక్క‌ల‌కు పాదులు చేసి ప్రాణ‌ప్ర‌తిష్ట చేశారు. 



26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

క్రీడాకార‌ణి నైనా జైశ్వాల్ ఉత్తేజ పూరిత ప్ర‌సంగం

అంత‌ర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకార‌ణి నైనా జైశ్వాల్ ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన క్రీడాదినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హ‌జ‌రై చేసిన ప్ర‌సంగం ఎంతో అద్బుతంగా ఉంది. విద్యార్దుల ద‌గ్గ‌ర నుంచి ఉద్యోగార్దులైన యువ‌త వ‌ర‌కు అంద‌ర్ని ఎంతో ఆక‌ర్షించింది. ఆమె ప్ర‌సంగం ఆద్యంతం చాలా ఆహ్లాదంగా సాగుతూనే అంద‌రిని అల‌రించింది. ఆలోచ‌న‌లు రేకెత్తించింది. త‌న‌కున్న ప్ర‌తిభ‌ను చాటుకుంటేనే అంద‌రు త‌న‌లా ఇష్ట‌ప‌డి చ‌దివితే క‌ష్ట‌డ‌ప‌డకుండానే విజ‌యాల‌నే ఫ‌లితాల‌ను సాధించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. త‌ల్లిదండ్రుల విలువ‌ను చాటుతూ... విజ‌యం అనేది భ‌గ‌వంతుడు ఇచ్చే వ‌స్తువు మాత్రం కానేకాద‌ని... క‌ష్ట‌ప‌డితేనే వ‌స్తుంద‌ని చాటి చెప్పింది. భ‌గ‌వంతుడు మన‌కు దారులు మాత్ర‌మే చూపిస్తాడు...  గ‌మ్యాన్ని మ‌న‌మే చేరుకోవాల‌ని వేదాంతి త‌ర‌హ‌లో ఆ చిన్నారి చెప్పిన తీరు ఎంతో ఆక‌ట్టుకుంది. నిజ‌మే... ఎనిమిది సంవ‌త్స‌రాల‌కు ప‌దోత‌ర‌తిలో ఉత్తీర్ణ‌త సాధించి 13 సంవ‌త్స‌రాల‌కు ప‌ట్ట‌భ‌ద్రురాలైన జైశ్వాల్ ఆత్మ‌విశ్వాసం ముందు జ‌యం మొక‌రిల్లాల్సిందే. అయితే... త‌న‌లా అంద‌రు సిద్దం కావాల‌ని... తల్లిదండ్రుల ల‌క్ష్యాల‌ను త‌మ లక్ష్యాలుగా మార్చుకోని విజ‌యం సాధించ‌డంలో తాను పొందిన ఆనందం అంద‌రు పొందాల‌ని జైశ్వాలు కోరుతుంది. ఎందుకంటే... చిన్నారులంతా భావి భార‌త సంప‌ద కాబ‌ట్టి. స‌మున్న‌త‌మైన శిఖ‌రాల‌ను అధిరోహించాలంటే శ్ర‌మ ఒక్క‌టే మార్గ‌మ‌ని చాటి చెప్పిన నైనా జైశ్వాల్‌కు హాట్స్‌ఫ్ చెప్పి తీరాల్సిందే. 




టేబుల్  టెన్నిస్‌లో బాల్ ఒడుపును ప‌సిగ‌ట్ట‌డంలో అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న జైశ్వాల్ ప‌ది ముందు మాట్లాడే స‌మ‌యంలో మాటల‌ ఒడుపును కూడా ఎంతో అద్బుతంగా అందిపుచ్చుకుంది. ఆమె నోటి నుంచి జాలువారిన ఒక్కో మాట... విద్యార్దుల మ‌న‌స్సుల్లో నేరుగానే నాటుకునే తూటాలానే ఉంది. ఇంగ్లీషు వ్యామోహంలో ప‌డి మ‌న పిల్ల‌లు తెలుగు కూడా స‌రిగా మాట్లాడ‌లేక అల్లాడిపోతున్నారు. మ‌రీ... జైశ్వాల్ తెలుగులు కీర‌వాణి ప‌లుకుల క‌న్నా తియ్య‌నైనా మాటలు ప‌లికించి... హిందిలో అద్బుతంగా ప్ర‌సంగం చేసింది. చెట్టుకు కాయ భారం కాకున్నా... ఇప్ప‌టి త‌ల్ల‌లు కొంత‌మంది ఆడ‌పిల్ల‌లు త‌మ‌కు భార‌మ‌ని అనుకుంటున్నార‌ని... అందుకు విజ‌య‌వాడ ఢిల్లీలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు కూడా కార‌ణ‌మ‌ని... వాటిని తునాతున‌క‌లు చెద్దామ‌ని బాలిక‌ల‌కు స్పూర్తిని క‌లిగిచింది. నాకు కిర‌ణ్ బేడి ఆద‌ర్శ‌మ‌ని నైనా జైశ్వాల్ చెపుతున్న తీరు... ఆమెను ఎంతో మందికి ఆద‌ర్శంగా మారుస్తుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 

17, ఫిబ్రవరి 2016, బుధవారం

గ్రీన్ డే వేడుక‌లు

                          పాఠ‌శాల‌లో వైభ‌వంగా గ్రీన్ డే వేడుక‌లు             




  
                                     గ్రీన్ డే వేడుకల రధ సారధులు శ్రీమతి వెంకటేశ్వరమ్మ శ్రీమతి నాగమ్మ 


                                                       గ్రీన్ డే వేడుకల్లో ఉపాధ్యాయబృందం 

 శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ ఎయిడెడ్ ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లోగ్రీన్ డే వేడుక‌లు ఉత్సాహ‌భ‌రితంగా జ‌రిగాయి. కార్పోరేట్ విద్యాసంస్థ‌ల‌కే ప‌రిమిత‌మైన క‌ల‌ర్స్ డే వేడుక‌ల‌ను మొట్ట‌మొద‌టిసారిగా ఎయిడెడ్ పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన ఘ‌న‌త శ్రీ స‌ర‌స్వ‌తి కమిటీ స్కూలు స్వంతం చేసుకుంది. ప్రాథ‌మిక విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల్లో రంగుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం...అ దే స‌మ‌యంలో తిసుకునే ఆహ‌రం గురించి వారికి వివ‌రించేందుకు పాఠ‌శాల యాజ‌మాన్యం గ్రీన్ డేను చ‌క్క‌గా ఏర్పాటు చేసింది. చిన్నారులు అంద‌రు ఎంతో ముచ్చ‌టగా గ్రీన్ దుస్తులు ధ‌రించి ఈన్ గ్రీన్ క‌ల‌ర్ కుర‌గాయాలు... వంట‌లు ఇంటి నుంచి చేసుకుని రావ‌డం విశేషం. విద్యార్దుల త‌ల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో త‌మ పిల్ల‌ల‌ను చ‌క్క‌గా ముస్తాబు చేసి గ్రీన్ డే వేడుక‌ల‌కు పంపించారు. అమ్మ‌లు కూడా గ్రీన్ క‌ల‌ర్ చీర‌లు కట్టుకుని త‌మ పిల్ల‌ల గ్రీన్ డే వేడుక‌ల‌ను తిల‌కించేందుకు రావ‌డంతో స‌ర‌స్వ‌తి క‌మిటీ పాఠ‌శాల ఆవ‌ర‌ణంతా గ్రీన్ మ‌యంగా మారిపోయింది. గ్రీన్ క‌ల‌ర్లో ఉండే పండ్లు పుచ్చ‌కాయ‌లు... ద్రాక్ష నుంచి అన్ని ర‌కాల కాయ‌లు గ్రీన్ డే ఎగ్జిబిష‌న్లో ప్ర‌ద‌ర్శించారు. ఇక ఆకు కూర‌లైతే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని ర‌కాల‌ను విద్యార్దులు స్వ‌యంగా తీసుకు వ‌చ్చి ప్ర‌ద‌ర్శ‌న‌లో ఉంచారు. ఆకుప‌చ్చ కుర‌గాయ‌లైన ముల‌క్కాయ‌లు... బెండ‌కాయ‌లు, కాక‌ర‌కాయ‌లు వంటివెన్నో ప్ర‌ద‌ర్శ‌న‌లో విద్యార్దుల‌ను ఆకర్షించాయి. ప్ర‌కృతి ప్ర‌సాదించిన ఆకు ప‌చ్చ‌ని కుర‌గాయ‌లు పండ్లు తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను చిన్నారులు త‌మ చిట్టి పొట్టి మాట‌ల‌తో సంద‌ర్శ‌కుల‌కు వివ‌రించ‌డం అంద‌ర్ని ఎంతో ఆక‌ట్టుకుంది. విద్యార్దుల‌కు ఆకు కూర‌లు, కుర‌గాయ‌ల వ‌ల్ల ఉండే లాభాల‌ను వివ‌రించ‌డం ద్వారా వారు ప్ర‌తిరోజు త‌మ ఆహారంలో అవి ఖ‌చ్చితంగా ఉండేలా త‌ల్లిదండ్రుల‌ను అడుగుతార‌నే తాము గ్రీన్ డే నిర్వ‌హించిన‌ట్లు పాఠ‌శాల క‌మిటీ స‌భ్యుడు ఉమ్మ‌డిశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు తెలిపారు. పిల్ల‌ల‌కు ప‌ర్యావ‌ర‌ణం గురించి కూడా చిన్న‌త‌నం నుంచే అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన బాధ్య‌త విద్యాసంస్థ‌ల‌పై ఉంద‌ని... అందుకే శ్రీ స‌రస్వ‌తి కమిటీ స్కూలు గ్రీన్ డే వేడుక‌లు నిర్వ‌హించి విద్యార్దుల అభిరుచుల‌ను చాటింద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ విద్యాసంస్థ‌ల‌న్ని క‌ల‌ర్స్ డేకు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికి త‌మ పాఠ‌శాల మాత్రం త‌ల్లిదండ్రుల స‌హ‌కారంతో గ్రీన్ డే నిర్వ‌హించ‌డం త‌మకు కూడా ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. ముఖ్యంగా ఒక‌టి రెండు త‌ర‌గ‌తుల ఉపాద్యాయ‌నిలు నాగ‌మ్మ‌, వెంకటేశ్వ‌ర‌మ్మ‌లు ఎంతో కృషి చేశార‌ని అభినందించారు. ఓక‌టి రెండు త‌ర‌గ‌తుల‌ చిన్నారులతో క‌ల‌ర్స్ డే చేయించిన ఘ‌న‌త వారికే ద‌క్కుతుంద‌ని, వారికి మిగిలిన ఉపాధ్యాయులు అంద‌రు ఎంతో చక్క‌గా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. గ్రీన్ డే సంద‌ర్భంగా విద్యార్దుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నంలో క‌రివేపాకుతో క‌లిపిన అన్నం... తోట‌కూర ప‌ప్పు పెట్ట‌డంతో విద్యార్దులు ఎంతో సంతోషంగా భోజ‌నం తిన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాఠ‌శాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు,  ప్ర‌ధానోపాధ్యాయుడు ర‌వీంద్ర‌బాబు, ఉపాధ్యాయ‌నీ ఉపాధ్యాయులు విజ‌య‌ల‌క్ష్మి, గోవింద‌రెడ్డి, ర‌వి, ప్ర‌మీల త‌దిత‌రులు పాల్గొన్నారు.