మొత్తం పేజీ వీక్షణలు

11, ఫిబ్రవరి 2015, బుధవారం

రాష్ట్రంలోనే తొలిగా పాటశాలలో బయో మాట్రిక్

                                   
శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల రాష్ట్రంలో ఎయిడెడ్, ప్రభుత్వ విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రాబాబు నాయుడు గారి స్పూర్తిని అందిపుచ్చుకుని మన పాటశాలలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం చేయడం జరిగింది. మన పాటశాలలోని ఉపాధ్యాయని ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో విద్యా భోదన చేస్తున్నారు. విద్యార్థులు కూడా చక్కగా ఉపాధ్యాయుల మనస్సులు మెప్పిస్తూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. ఈ నేపద్యంలో ప్రభుత్వం పాటశాలల్లో విద్యార్ధుల సంఖ్యను కచ్చితంగా తెలుసుకునేందుకు బయో మాట్రిక్ విధానం ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తుంది. అదే సమయంలో ఉపాధ్యాయులు పాటశాలకు వచ్చి వెళ్ళే సమయం కూడా తెలుసుకోవాలని భావిస్తుంది. మన విద్య వ్యవస్థలో ప్రబుత్వం తీసుకు రావాలని అనుకుంటున్న ఈ ఆలోచన మన పాటశాల పాలకవర్గానికి స్పూర్తిని కలిగించింది. అందుకే ప్రభుత్వం చేస్తున్న ఆలోచనను మనం అమలు చేద్దామని ముందుకు రావడం... అందుకు మన  ఉపాధ్యాయని ఉపాధ్యాయులు సహకరిచడం సంతోషకరం. మన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాసరెడ్డి గారితో బయో మాట్రిక్ విధానం పాటశాలలో ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్లు తెలియ చేసిన వెంటనే అయన అభినందనలు తెలియచేశారు. ఇక మీదట మన శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాలలో ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, విద్యార్ధుల రాక పోకలన్ని బయో మాట్రిక్ ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మన పాటశాల రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా  సంస్థలకు కచ్చితంగా ఆదర్శం కాగలదని భావిస్తున్నాను. మన పాటశాల పాలకవర్గం, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారంతోనే మనం  ఈ ఘనతను సాధించగాలిగాము. అందుకు అందరికి ధన్యవాదాలు. 
                                                                                                  
                                                                                                            దాసరి వెంకట సుబ్బారావు 
                                                                                                                    కరస్పాండెంట్ 
                                                                                       శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల

శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల
బయో మాట్రిక్ మెషిన్ 
బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల విద్యార్దినిలు 
బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల విద్యార్దినిలు 
బయో మాట్రిక్ మెషిన్లో వేలిముద్రలు వేస్తున్న మన పాటశాల ఉపాధ్యాయనీలు 






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి