కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్‌లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
22, డిసెంబర్ 2016, గురువారం
సరస్వతి కమిటీ పాఠశాలో ఘనంగా సెమి క్రిస్మస్ వేడుకలు
సహనంతో మెలగడం పాటు అందరు శాంతియుతంగా జీవించాలని కోరుకోవడం ద్వారా ఏసు క్రీస్తు మానవాళికి గొప్ప సందేశం అందించారని గుంటూరు ఉప విద్యాశాఖాధికారి రమేష్ బాబు తెలిపారు. భావి భారతపౌరులైన విద్యార్దులు క్రీస్తు సందేశాన్ని అర్ధం చేసుకుని ఆచరిస్తే మంచి పౌరులుగా మారతారని అన్నారు. నగరంలోని సీతారామనగర్లో ఉన్న శ్రీ సరసర్వతి కమిటీ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల్లో సెమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉప విద్యాశాఖాధికారి రమేష్‌బాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు పాఠశాల కరస్పాండెంట్ దాసరి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఉప విద్యాశాఖాధికారి రమేష్ బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సరస్వతి కమిటీ స్కూలు విద్యార్దులు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చదువుల్లో ముందంజలో ఉన్నారని ప్రశంసించారు. ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్దులు ఇంత చక్కగా క్రమశిక్షణతో ఉండటం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం చక్కని ఉపాధ్యాయులను నియమించి ఉచితంగా విద్యను అందిస్తుందని ఆ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని సూచించారు. విద్యార్దులు, తల్లిదండ్రుల కోరిక మేరకు సరస్వతి కమిటీ స్కూలుకు ఎనిమిదో తరగతిని కూడా మంజూరు చేస్తున్నట్లు ఉప విద్యాశాఖాధికారి రమేష్‌బాబు ప్రకటించారు. పాఠశాల కరస్పాండెంట్ దాసరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ సరస్వతి కమిటీ పాఠశాల ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో విద్యాబోధన చేస్తున్నారని అన్నారు. అందుకే విద్యార్దులు... వారి తల్లిదండ్రుల అభిమానం సంపాదించుకోగలగారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్దులే ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్దులు ఏడో తరగతి ముగిసిన తర్వాత బాలికలంతా డ్రాప్ అవుట్లుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎనిమిదో తరగతి విద్యాబోధన చేసేందుకు అనుమతి ఇస్తే బాలికా విద్యకు మేలు చేసిన వారౌతారని అధికారులను కోరారు. ఎనిమితో తరగతి విద్యార్దులకు బోధన చేసేందుకు తమ ఉపాధ్యాయులు కూడా సిద్దంగానే ఉన్నారని వివరించారు. క్రైస్తవ మత గురువు ఫాదర్ జేసుదానం మాట్లాడుతూ సెమి క్రిస్‌మస్ వేడుకలను ప్రభుత్వ పాఠశాలలో చేయడం చాలా అరుదని, అటువంటిది సరస్వతి పాఠశాల నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. క్రీస్తు బోధనలను ఆయన విద్యార్దులకు వివరించారు. అనంతరం క్రిస్‌మస్ కేకును ఉప విద్యాశాకాధికారి రమేష్‌బాబు కట్ చేశారు. ఈ సంద్భర్భంగా సరస్వతి కమిటీ పాఠశాల విద్యార్దిని విద్యార్దులు క్రీస్తు సందేశాన్ని వివరించే పాటలకుచక్కని నృత్యాలు చేశారు. జింగిల్ బెల్స్ వంటి పాటలతో అందర్ని ఆకట్టుకున్నారు. క్రిస్మస్ వేడుకల్లో శ్రీనాథ్ ఉన్నత పాఠశాల అధ్యక్షురాలు పిన్నమనేని వరలక్ష్మీ, క్రైస్తవ మత గురువు శ్యామసన్ రాబర్ట్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు, కమిటీ సభ్యులు పసుపులేటి వెంకాయమ్మ, సంకటి సాంబశివరావు, ఉపాధ్యాయులు పి విజయలక్ష్మీ, గోవిందరెడ్డి,ప్రమీల, రవి, దీనా, వెంకటేశ్వరమ్మ, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)















