అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం పాటశాలలో ఘనంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు భాషా ఆచార్యులు కృష్ణారావు గారు ముఖ్య అతిదిగా పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్బంగా కృష్ణారావు గారు మాట్లాడుతూ మాతృ భాషలో విద్యను అభ్యసించిన విద్యార్దులు పరాయి భాషలో చదువుకున్న విద్యార్దుల కంటే ఎంతో తెలివిగా ఉంటారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయని చెప్పారు. అందుకే యూరప్ దేశాలన్నీ తమ తమ మాతృ భాషల్లోనే తమ పిల్లలకు విద్యా బోధన చేయిస్తున్నాయని తెలిపారు. దాని వల్ల వారి మాతృ భాషా వికాసం చెందడంతోపాటు విద్యార్దులు కూడా మంచి జ్ఞానాన్ని సముపార్జించి ఉజ్వల భవిష్యత్తును పొందగలుగుతున్నారని అన్నారు. మనకున్న ఆంగ్ల భాషా వ్యామోహం కొంత తగ్గించుకోవలిసిన అవసరం ఎంతో ఉందని కృష్ణారావు గారు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో పాటశాల అధ్యక్షురాలు శ్రీమతి లగడపాటి రామలక్ష్మి గారు, ప్రధానోపాద్యాయులు రవీంద్రబాబు గారు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![]() |
| తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేస్తున్న నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు భాషా ఆచార్యులు కృష్ణారావు గారు |
![]() |







కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి