మొత్తం పేజీ వీక్షణలు

23, మార్చి 2015, సోమవారం

సర్దార్ భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమం

దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ త్యాగాలను నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని శ్రీ సరస్వతి కమిటి అధ్యక్షురాలు లగడపాటి రామలక్ష్మి అన్నారు.  సీతారామ నగరంలోని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాలలో జరిగిన భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమంలో లగడపాటి రామలక్ష్మి భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు పోరాటం చేసారని వారిలో భగత్ సింగ్ వంటి నేతలు చేసిన సాహసం చరిత్రలో నిలిచి పోయాయని రామలక్ష్మి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు భగత్ సింగ్ ఏ మాత్రం వేరవలేదని అన్నారు. ఉరి శిక్ష కోసం ఎదురు చూసి భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసే అవకాశం నాకు వచ్చినందుకు గర్వ పడుతున్నానని చాటిన భగత్ సింగ్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని రామలక్ష్మి పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల ప్రధానోపాద్యయులు బి రవీంద్రబాబు మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్దులు  పాల్గొన్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి