కార్మిక... శ్రామిక వర్గాల చిన్నారులకు విద్య బుద్ధులు నేర్పించేందుకు గుంటూరు సీతారాంనగర్లో 1971లో స్థాపించబడింది. నాటి నుంచి నేటి వరకు వేలాది విద్యార్ధులు వైద్యులుగా... న్యాయవాదులుగా... ఇంజనీర్లుగా... పోలీసులుగా... ఆడిటర్లుగా అనేక రూపాల్లో సేవలు అందిచేందుకు అవసరమైన పునాది వేసింది. నిరుపేదల బిడ్డలకు బంగారు భవిష్యత్ అందిచడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది శ్రీ సరస్వతీ కమిటీ ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల.
మొత్తం పేజీ వీక్షణలు
23, మార్చి 2015, సోమవారం
సర్దార్ భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమం
దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన సర్దార్ భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ త్యాగాలను నేటి యువతరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని శ్రీ సరస్వతి కమిటి అధ్యక్షురాలు లగడపాటి రామలక్ష్మి అన్నారు. సీతారామ నగరంలోని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాలలో జరిగిన భగత్ సింగ్ 84వ వర్ధంతి కార్యక్రమంలో లగడపాటి రామలక్ష్మి భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది వీరులు పోరాటం చేసారని వారిలో భగత్ సింగ్ వంటి నేతలు చేసిన సాహసం చరిత్రలో నిలిచి పోయాయని రామలక్ష్మి తెలిపారు. దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు భగత్ సింగ్ ఏ మాత్రం వేరవలేదని అన్నారు. ఉరి శిక్ష కోసం ఎదురు చూసి భారత దేశం కోసం ప్రాణ త్యాగం చేసే అవకాశం నాకు వచ్చినందుకు గర్వ పడుతున్నానని చాటిన భగత్ సింగ్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని రామలక్ష్మి పిలుపు ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల ప్రధానోపాద్యయులు బి రవీంద్రబాబు మరియు ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్దులు పాల్గొన్నారు.
18, మార్చి 2015, బుధవారం
పాటశాలపై జెమిని న్యూస్ లో స్టోరి
పాటశాలపై జెమిని న్యూస్ లో స్టోరి
పాటశాల బయోమెట్రిక్ పై పత్రికలలో వచ్చిన వార్తా కధనాలు
జెమిని న్యూస్ చానెల్లో శ్రీ సరస్వతి కమిటి పాటశాల బయోమెట్రిక్ కధనం
పాటశాలలో బయోమెట్రిక్ ను పరిసిలించేందుకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రినువాసుల రెడ్డి గారి సమక్షంలో బయోమెట్రిక్ పరికరంలో వేలిముద్రలు వేసిన ఉపాధ్యాయులు విద్యార్దులు. ఆ సందర్బంగా జరిగిన సభ జెమిని న్యూస్ చానెల్లో వచ్చిన వార్తా కదనం.
16, మార్చి 2015, సోమవారం
జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వి శ్రీనివాసుల రెడ్డి గారు పాటశాల బయోమెట్రిక్ పరిశీలన
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)












