మొత్తం పేజీ వీక్షణలు

26, ఫిబ్రవరి 2016, శుక్రవారం

క్రీడాకార‌ణి నైనా జైశ్వాల్ ఉత్తేజ పూరిత ప్ర‌సంగం

అంత‌ర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకార‌ణి నైనా జైశ్వాల్ ఓ పాఠ‌శాల‌లో జ‌రిగిన క్రీడాదినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా హ‌జ‌రై చేసిన ప్ర‌సంగం ఎంతో అద్బుతంగా ఉంది. విద్యార్దుల ద‌గ్గ‌ర నుంచి ఉద్యోగార్దులైన యువ‌త వ‌ర‌కు అంద‌ర్ని ఎంతో ఆక‌ర్షించింది. ఆమె ప్ర‌సంగం ఆద్యంతం చాలా ఆహ్లాదంగా సాగుతూనే అంద‌రిని అల‌రించింది. ఆలోచ‌న‌లు రేకెత్తించింది. త‌న‌కున్న ప్ర‌తిభ‌ను చాటుకుంటేనే అంద‌రు త‌న‌లా ఇష్ట‌ప‌డి చ‌దివితే క‌ష్ట‌డ‌ప‌డకుండానే విజ‌యాల‌నే ఫ‌లితాల‌ను సాధించ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. త‌ల్లిదండ్రుల విలువ‌ను చాటుతూ... విజ‌యం అనేది భ‌గ‌వంతుడు ఇచ్చే వ‌స్తువు మాత్రం కానేకాద‌ని... క‌ష్ట‌ప‌డితేనే వ‌స్తుంద‌ని చాటి చెప్పింది. భ‌గ‌వంతుడు మన‌కు దారులు మాత్ర‌మే చూపిస్తాడు...  గ‌మ్యాన్ని మ‌న‌మే చేరుకోవాల‌ని వేదాంతి త‌ర‌హ‌లో ఆ చిన్నారి చెప్పిన తీరు ఎంతో ఆక‌ట్టుకుంది. నిజ‌మే... ఎనిమిది సంవ‌త్స‌రాల‌కు ప‌దోత‌ర‌తిలో ఉత్తీర్ణ‌త సాధించి 13 సంవ‌త్స‌రాల‌కు ప‌ట్ట‌భ‌ద్రురాలైన జైశ్వాల్ ఆత్మ‌విశ్వాసం ముందు జ‌యం మొక‌రిల్లాల్సిందే. అయితే... త‌న‌లా అంద‌రు సిద్దం కావాల‌ని... తల్లిదండ్రుల ల‌క్ష్యాల‌ను త‌మ లక్ష్యాలుగా మార్చుకోని విజ‌యం సాధించ‌డంలో తాను పొందిన ఆనందం అంద‌రు పొందాల‌ని జైశ్వాలు కోరుతుంది. ఎందుకంటే... చిన్నారులంతా భావి భార‌త సంప‌ద కాబ‌ట్టి. స‌మున్న‌త‌మైన శిఖ‌రాల‌ను అధిరోహించాలంటే శ్ర‌మ ఒక్క‌టే మార్గ‌మ‌ని చాటి చెప్పిన నైనా జైశ్వాల్‌కు హాట్స్‌ఫ్ చెప్పి తీరాల్సిందే. 




టేబుల్  టెన్నిస్‌లో బాల్ ఒడుపును ప‌సిగ‌ట్ట‌డంలో అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న జైశ్వాల్ ప‌ది ముందు మాట్లాడే స‌మ‌యంలో మాటల‌ ఒడుపును కూడా ఎంతో అద్బుతంగా అందిపుచ్చుకుంది. ఆమె నోటి నుంచి జాలువారిన ఒక్కో మాట... విద్యార్దుల మ‌న‌స్సుల్లో నేరుగానే నాటుకునే తూటాలానే ఉంది. ఇంగ్లీషు వ్యామోహంలో ప‌డి మ‌న పిల్ల‌లు తెలుగు కూడా స‌రిగా మాట్లాడ‌లేక అల్లాడిపోతున్నారు. మ‌రీ... జైశ్వాల్ తెలుగులు కీర‌వాణి ప‌లుకుల క‌న్నా తియ్య‌నైనా మాటలు ప‌లికించి... హిందిలో అద్బుతంగా ప్ర‌సంగం చేసింది. చెట్టుకు కాయ భారం కాకున్నా... ఇప్ప‌టి త‌ల్ల‌లు కొంత‌మంది ఆడ‌పిల్ల‌లు త‌మ‌కు భార‌మ‌ని అనుకుంటున్నార‌ని... అందుకు విజ‌య‌వాడ ఢిల్లీలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లు కూడా కార‌ణ‌మ‌ని... వాటిని తునాతున‌క‌లు చెద్దామ‌ని బాలిక‌ల‌కు స్పూర్తిని క‌లిగిచింది. నాకు కిర‌ణ్ బేడి ఆద‌ర్శ‌మ‌ని నైనా జైశ్వాల్ చెపుతున్న తీరు... ఆమెను ఎంతో మందికి ఆద‌ర్శంగా మారుస్తుంద‌న‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి