పాఠశాలలో వైభవంగా గ్రీన్ డే వేడుకలు
గ్రీన్ డే వేడుకల రధ సారధులు శ్రీమతి వెంకటేశ్వరమ్మ శ్రీమతి నాగమ్మ
గ్రీన్ డే వేడుకల్లో ఉపాధ్యాయబృందం
శ్రీ సరస్వతి కమిటీ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాలలోగ్రీన్ డే వేడుకలు ఉత్సాహభరితంగా జరిగాయి. కార్పోరేట్ విద్యాసంస్థలకే పరిమితమైన కలర్స్ డే వేడుకలను మొట్టమొదటిసారిగా ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహించిన ఘనత శ్రీ సరస్వతి కమిటీ స్కూలు స్వంతం చేసుకుంది. ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుల్లో రంగులపై అవగాహన కల్పించడం కోసం...అ దే సమయంలో తిసుకునే ఆహరం గురించి వారికి వివరించేందుకు పాఠశాల యాజమాన్యం గ్రీన్ డేను చక్కగా ఏర్పాటు చేసింది. చిన్నారులు అందరు ఎంతో ముచ్చటగా గ్రీన్ దుస్తులు ధరించి ఈన్ గ్రీన్ కలర్ కురగాయాలు... వంటలు ఇంటి నుంచి చేసుకుని రావడం విశేషం. విద్యార్దుల తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్సాహంతో తమ పిల్లలను చక్కగా ముస్తాబు చేసి గ్రీన్ డే వేడుకలకు పంపించారు. అమ్మలు కూడా గ్రీన్ కలర్ చీరలు కట్టుకుని తమ పిల్లల గ్రీన్ డే వేడుకలను తిలకించేందుకు రావడంతో సరస్వతి కమిటీ పాఠశాల ఆవరణంతా గ్రీన్ మయంగా మారిపోయింది. గ్రీన్ కలర్లో ఉండే పండ్లు పుచ్చకాయలు... ద్రాక్ష నుంచి అన్ని రకాల కాయలు గ్రీన్ డే ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఇక ఆకు కూరలైతే ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలను విద్యార్దులు స్వయంగా తీసుకు వచ్చి ప్రదర్శనలో ఉంచారు. ఆకుపచ్చ కురగాయలైన ములక్కాయలు... బెండకాయలు, కాకరకాయలు వంటివెన్నో ప్రదర్శనలో విద్యార్దులను ఆకర్షించాయి. ప్రకృతి ప్రసాదించిన ఆకు పచ్చని కురగాయలు పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చిన్నారులు తమ చిట్టి పొట్టి మాటలతో సందర్శకులకు వివరించడం అందర్ని ఎంతో ఆకట్టుకుంది. విద్యార్దులకు ఆకు కూరలు, కురగాయల వల్ల ఉండే లాభాలను వివరించడం ద్వారా వారు ప్రతిరోజు తమ ఆహారంలో అవి ఖచ్చితంగా ఉండేలా తల్లిదండ్రులను అడుగుతారనే తాము గ్రీన్ డే నిర్వహించినట్లు పాఠశాల కమిటీ సభ్యుడు ఉమ్మడిశెట్టి వెంకటేశ్వరరావు తెలిపారు. పిల్లలకు పర్యావరణం గురించి కూడా చిన్నతనం నుంచే అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యాసంస్థలపై ఉందని... అందుకే శ్రీ సరస్వతి కమిటీ స్కూలు గ్రీన్ డే వేడుకలు నిర్వహించి విద్యార్దుల అభిరుచులను చాటిందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలన్ని కలర్స్ డేకు దూరంగా ఉంటున్నప్పటికి తమ పాఠశాల మాత్రం తల్లిదండ్రుల సహకారంతో గ్రీన్ డే నిర్వహించడం తమకు కూడా ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఒకటి రెండు తరగతుల ఉపాద్యాయనిలు నాగమ్మ, వెంకటేశ్వరమ్మలు ఎంతో కృషి చేశారని అభినందించారు. ఓకటి రెండు తరగతుల చిన్నారులతో కలర్స్ డే చేయించిన ఘనత వారికే దక్కుతుందని, వారికి మిగిలిన ఉపాధ్యాయులు అందరు ఎంతో చక్కగా సహకరించారని తెలిపారు. గ్రీన్ డే సందర్భంగా విద్యార్దులకు మధ్యాహ్న భోజనంలో కరివేపాకుతో కలిపిన అన్నం... తోటకూర పప్పు పెట్టడంతో విద్యార్దులు ఎంతో సంతోషంగా భోజనం తిన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు, ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు, ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, గోవిందరెడ్డి, రవి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.



































కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి