మొక్కలు మానవ జీవన ఆధారాలు... అందుకే ఆ మొక్కకు ఎలా మొక్కాలో... మొక్కను ఎలా కాపాడుకోవాలో రేపటిపౌరులైన నేటి బాలలకు వివరించేందుకు శ్రీ సరస్వతి కమిటీ ప్రాథమికోన్నత పాఠశాల వన భారతి కార్యక్రమం చేపట్టింది. పాఠశాల ఆవరణలో ఉన్న తెలుగుతల్లి విగ్రహం చుట్టుపక్కల తెలుగు వనాన్ని పెంచేందుకు శ్రీకారం చుట్టింది. సుమ బాలలను విరబూయించేందుకు బాలలు తమ బంగారు చిట్టి చేతులతో చిట్టిమొక్కలకు పాదులు చేసి ప్రాణప్రతిష్ట చేశారు.



కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి