మొత్తం పేజీ వీక్షణలు

24, నవంబర్ 2013, ఆదివారం

విధ్యాశాఖాధికారి సుబ్బారావుగారికి సన్మానం

అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్న పాటశాలల నుంచి ఉన్నత భావాలు కలిగిన విద్యార్ధులు వస్తారని మండల విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు అన్నారు. ఈ నెలాఖరున పదవి విరమణ చేస్తున్న మండల విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావుకు  పాటశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు సీతారామనగర్లోని శ్రీ సరస్వతి కమిటి ప్రాధమికోన్నత పాటశాలలో ఘన సన్మానం చేశారు. సరస్వతి కమిటి పాటశాలలో ఈ  విద్యా సంవత్సరంలో 91 మంది విద్యార్ధులు చేరడం ఉపాధ్యాయుల కృషి వల్లనేనని విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు ప్రశంసించారు. పది మంది విద్యార్దులు చేరితే ఘనంగా భావిస్తున్న ఈ తరుణంలో వంద మంది విధ్యార్ధులను పాటశాలకు రప్పించడం అభినందనియమన్నారు. అందుకే జిల్లా ఉన్నతాధికారులు సైతం సంతోషించి ఉపాధ్యాయులను పంపించారని గుర్తు చేశారు. పాటశాల విశ్రాంత ప్రధానోపాధ్యయని వరలక్ష్మి మాట్లాడుతూ 300 మంది విద్యార్ధులు ఇద్దరు ఉపాధ్యాయులతో ఇబ్బంది పడుతున్న పాటశాలకు అదనంగా ఉపాధ్యాయులను నియమించడంలో విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావు ఎంతో కృషి చేసారని అన్నారు. ఆదనంగా ఉపాధ్యాయులు రావడం వాళ్ళ పేద విద్యార్ధులకు మెరుగైన విధ్యాబోధన చేసే అవకాశం కలిగిందని తెలిపారు. ఐనా పాటశాలలో లెక్కల ఉపాధ్యాయుని కొరత ఉందని, ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు. ఈ సందర్బంగా విధ్యశాఖాదికారి కె వి సుబ్బారావుకు  పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు శాలువా కప్పి మేమొంటొ అందజేసి ఘనంగా సన్మానించారు. విద్యాశాఖ అధికారిగా అయన అందిoచిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి పాటశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు అధ్యక్షత వహించగ ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పి విజయలక్ష్మి. వెంకటేశ్వరమ్మ. దీనా, మధుసుధనరెడ్డి, రవి, గోవిందరెడ్డి మరియు సి అర్ పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి శాలువా కప్పి  సన్మానిస్తున్న పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు   ఉపాధ్యాయని ఉపాధ్యాయులు 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారికి మేమొంటొ అందజేసిన  పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు 

మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారితో పాటశాల ఉ;ఉపాధ్యాయని ఉపాధ్యాయులు    
మాట్లాడుతన్న విశ్రాంత ప్రధానోపాధ్యయని శ్రీమతి వరలక్ష్మి గారు, మండల విద్యాశాఖాధికారి కె వి సుబ్బారావు గారు, పాటశాల  కరస్పాండెంట్ డి వి సుబ్బారావు గారు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాసరావు,  ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి