ఆత్మ విశ్వాసం పెంచుకోవడం ద్వారా విద్యార్ధులు తమ లక్ష్యాలు సాదించగలరని శ్రీ సరస్వతి కమిటి ఎయిడెడ్ ప్రాధమికోన్నత పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు తెలిపారు. బాలల దినోత్సవం సందర్బంగా పాటశాలలో జరిగిన వేడుకల్లో అయన ముఖ్య అతిదిగా పాల్గొన్నారు.విద్యార్ధులకు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యను అందించడం ద్వారా నవ సమాజ నిర్మాణానికి బలమైన పునాదులు వేయాలని ఉపాధ్యాయులను కోరారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రు స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్ళిన తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి లేఖలు వ్రాసి ఎంతో చైతన్యం కలిగించిన విషయం ఇటు ఉపాధ్యాయులకు అటు విద్యార్ధులకు ఆదర్శ ప్రాయమని అన్నారు. వేడుకల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డి టి యఫ్ ఉపాధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ సరస్వతి స్కూల్ విద్యార్ధులు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారని, అందుకే ఎంతోమంది ఉన్నత శిఖరాలు అధిరోహించారని అన్నారు. పాటశాల విశ్రాంత ప్రధానోపధ్యాయని వరలక్ష్మి మాట్లాడుతూ జాతీయ నేతల జీవితాలను విద్యార్ధులు స్పూర్తిగా తీసుకోవాలని చిన్నారులకు సూచించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభను ప్రదర్శించిన విద్యార్ధులకు బహుమతులను ప్రదానం చేశారు. పేద విద్యార్దులకు ఓబులనాయుడు పాలెంకు చెందిన సూరగాని వేణుబాబు పాటశాల డ్రెస్ను అందజేశారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది చింతల మల్లిఖార్జునరావు, పాటశాల ప్రదనోపాద్యాయుడు రవీంద్రబాబు, శ్యాంసన్ రాబర్ట్స్, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు .
 |
బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న పాటశాల కరస్పాండెంట్ డి వి సుబ్బారావు వేదికపై (ఎడమ నుంచి) విశ్రాంత అధ్యాపకులు నరసింహారావు, పాటశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయని వరలక్షి, డి టి ఎఫ్ ఉపాధ్యక్షులు అంజిరెడ్డి, సో దసీడ్ సంస్థ నిర్వాహకులు శ్యామ్సన్ రాబర్ట్స్, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గోవిందరెడ్డి, పాటశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రబాబు గారు
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి