మొత్తం పేజీ వీక్షణలు

19, ఫిబ్రవరి 2017, ఆదివారం

వైభ‌వంగా అరంజ్ క‌ల‌ర్ డే వేడుక‌లు

మ‌న పాఠ‌శాల్లో ది.18.02.2017న అరంజ్ క‌ల‌ర్ డే వేడుక‌లు అత్యంత ఘ‌నంగా నిర్వ‌హించ‌డ‌మైన‌ది. గ‌త ఏడాది ఇదే రోజున నిర్వ‌హించిన గ్రీన్ క‌ల‌ర్ డే వేడుక‌ల స్పూర్తితో ఈ ఏడాది నిర్వ‌హించిన అరంజ్ క‌ల‌ర్ డే వేడుక‌లు మ‌రింత ఉత్సాహంగా సాగాయి. ఇటు విద్యార్దులు... అటు ఉపాధ్యాయులు ఎంతో సంతోషంగా వేడుక‌ల్లో బాగ‌స్వాములైయ్యారు. ముఖ్యంగా ఒక‌టి రెండు త‌ర‌గ‌తుల ఉపాధ్యాయ‌నీలైన శ్రీ మ‌తి నాగ‌మ్మ‌, శ్రీమతి వెంక‌టేశ్వ‌ర‌మ్మ‌లు త‌మ పిల్ల‌లు... వారి త‌ల్లిదండ్రుల‌ను చ‌క్క‌గా మోటివేట్ చేయ‌గ‌లిగారు. దీంతో గ‌త ఏడాది కంటే త‌ల్లిదండ్రుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. పేద పిల్ల‌లు మాత్ర‌మే చ‌దువుకునే ప్ర‌భుత్వం...ఎయిడెడ్ విద్యా సంస్థ‌ల్లో ఉత్స‌వాలు... సెల‌బ్రేష‌న్స్ ఏం జ‌ర‌గ‌వ‌నే అభిప్రాయాన్ని శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ స్కూలు ఏనాడో అధిగ‌మించేసింది.... అక్ష‌రాభ్యాసాలు... సెమి క్రిస్‌మ‌స్ వేడుక‌లు... సంక్రాంతి సంబ‌రాలు... ఉగాది ఉత్స‌వాలు వంటి వాటిని నిర్వహిస్తూ విద్యార్దుల‌కు విద్యాబుద్దులు నేర్పించ‌డంతో పాటుగా మ‌న‌దైన తెలుగు సంస్కృతిని వారికి అలవాటు చేసేందుకు చ‌క్క‌ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది.  ఇందుకు ముఖ్యంగా ఉపాధ్యాయ‌నీ ఉపాధ్యాయుల‌స‌హ‌కారం అద్బుతమైన‌ది. మాకెంద‌కులే అని అనుకోకుండా మాకు కాక‌పోతే ఇంకెవ‌రికి అనే భావ‌నను శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ పాఠ‌శాల ఉపాధ్యాయులు మ‌న‌స్సుల్లో విస్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అందుకే... ఇంత చ‌క్క‌టి కార్య‌క్ర‌మాలు పాఠ‌శాల చేయ‌గ‌లుగుతుంది. ఇక అరంజ్ క‌ల‌ర్ డే విష‌యానికి వ‌స్తే పిల్ల‌ల త‌ల్లిదండ్రులు కూడా ఈసారి పెద్ద ఎత్తున వ‌చ్చి త‌మ చిన్నారుల ప్ర‌తిభ‌ను గ‌మ‌నించ‌డం విశేషం. అంతేకాకుండా వారు కూడా బాగ‌స్వాములు అవుతూ త‌మ పిల్ల‌ల‌కు అరంజ్ క‌ల‌ర్ డ్ర‌స్సులు కుట్టించ‌డ‌మే కాదు... ప్ర‌ద‌ర్శ‌న కోసం అరంజ్ క‌ల‌ర్లో ఉన్న ఆహార ప‌దార్దాలను సైతం పిల్ల‌ల‌తో పంపించ‌డం అభినంద‌నీయం. మన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కోరుకునేది ఇదే ఉపాధ్యాయులు త‌ల్లిదండ్రులు బాగ‌స్వాములు అయితే... మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చ‌ని. ఆయ‌న ప‌దే ప‌దే చెప్పే మాట‌ల‌ను శ్రీ స‌ర‌స్వ‌తి క‌మిటీ ఉపాధ్యాయులు ఆచ‌ర‌ణ‌లో్ చేసి చూపించడం అభినంద‌నీయం... అనుస‌ర‌ణీయం. అరంజ్ క‌ల‌ర్ డే వేడుక‌ల‌ను క‌ర‌స్పాండెంట్‌(డి వి సుబ్బారావు)గా నేను ప్రారంభించే అవ‌కాశం రావ‌డం కూడా నా భాగ్యంగానే భావిస్తున్నాను. ఉపాధ్యాయ‌నీలు శ్రీ‌మ‌తి నాగ‌మ్మ‌, శ్రీమ‌తి వెంక‌టేశ్వ‌ర‌మ్మ ఈకార్య‌క్ర‌మం భారం భుజానా వేసుకున్నా వారు అరంజ్ క‌ల‌ర్ డే వేడ‌క‌ల ఏర్పాటు చేయ‌డంలో లెక్క‌ల ఉపాధ్యాయులు శ్రీయుతులు గోవింద‌రెడ్డి స‌హ‌యం కూడా ఎంతో ఉంది. అవ‌స‌ర‌మైన వ‌స్తువులు స‌మ‌కూర్చ‌డంలో గోవింద‌రెడ్డి ముందుకు రావ‌డం కూడా అభినంద‌నీయం. ఆయ‌న‌కు చేదోడువాదడుగా ఇంగ్లీషు ఉపాధ్యాయులు శ్రీ‌యుతులు ర‌వి స‌హ‌కారం కూడా మ‌ర‌వ‌లేనిది. ఇక పాఠ‌శాల‌లో అలంక‌రణ... త‌దిత‌ర విష‌యాల్లో హింది పండిట్ శ్రీమతి విజ‌య‌ల‌క్ష్మీ కూడా త‌న వంతు బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. సీనియ‌ర్ టీచ‌ర్గా అంద‌ర్ని కో ఆర్డినేట్ చేస్తూ ముఖ్యంగా త‌ల్లిదండ్రులు ఉపాధ్యాయుల మ‌ధ్య సంధాన‌క‌ర్త‌గా కూడా చ‌క్క‌ని ప్ర‌శంస‌నీయ‌మైన పాత్ర‌ను నిర్వ‌హించారు. వీరికి తెలుగు ఉపాధ్యాయ‌నీ శ్రీ‌మ‌తి ప్ర‌మీల‌, సైన్స్ ఉపాధ్యాయ‌నీ శ్రీ‌మ‌తి దీనా స‌హ‌కరించారు. వేడుక‌లకు అతిధిగా వ‌చ్చిన పాఠ‌శాల  మాజీ ప్రధానోపాధ్యాయ‌నీ, అక‌డ‌మిక్ స‌ల‌హాదారు శ్రీ‌మ‌తి ఎమ్ వ‌ర‌ల‌క్ష్మీ వేడుక‌ల‌ను చూసి అభినంద‌న‌లు తెల‌ప‌డం సంతోషంగా ఉంది. కార్పోరేట్ పాఠశాల‌ల కంటే బాగా చేసార‌నే ఆమెప్ర‌శంస‌లు అంద‌రికి అనందాన్ని ఇచ్చాయి. ఈ వేడుక‌లు మొత్తానికి హైలెట్ అయిన విష‌యం మ‌రోక‌టి ఉంది. అదే పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ‌యుతులు ర‌వీంద్ర‌బాబు భ‌లే మంచి రోజు అంటూ పాడిన పాట‌. నిజంగా అరంజ్ క‌ల‌ర్ వేడుక‌లు పాఠ‌శాల్లో మంచి వాతావ‌రణం జ‌రిగాయి. ఇక   పాఠ‌శాల క‌మిటీ స‌భ్యులు శ్రీయుతులు ఉమ్మ‌డిశెట్టి వెంక‌టేశ్వ‌ర‌రావు, సీఆర్‌పీ శ్రీ‌మ‌తి ఎస్తేరు రాణి, అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌లు ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు.































































కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి